Tuesday, May 14, 2024

ప్లస్‌ టూ కళాశాలలుగా పలు స్కూళ్లు.. ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని 292 ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను ప్లస్ టు జూనియర్‌ కళాశాలలుగా మార్పు చేస్తూ, 328 కేజీబీవీ హైస్కూల్స్‌ను ప్లస్ టు బాలికల జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రతి మండలంలో బాలికల కోసం ఒక జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దిశగా తాజాగా విద్యాశాఖ సర్క్యులర్‌ 31 విడుదల చేసింది. ఈ కళాశాలల్లో గ్రూపునకు 40 మంది చొప్పున ఎంపీసీ, బైపీసీ, సీఈసీలతో ఈ విద్యా సంవత్సరాన్ని నిర్వహించా లని ఉత్త ర్వుల్లో పేర్కొన్నారు. అలాగే కొత్తగా ఏర్పాటైన జూనియర్‌ కళాశా లల్లో అడ్మిషన్లు ప్రారంభించాలని, ల్యాబ్స్‌ అందుబాటులో లేని కళా శాలలు స్థానిక మోడల్‌ స్కూల్స్‌, కో ఎడ్యుకేషన్‌ జూనియర్‌ కళాశా లల్లోని ప్రయోగ శాలలు ఉపయోగించుకోవాలని సూచించారు.

విద్యార్థినులకు చేరువగా కళాశాల విద్య: జాక్టో

ప్రభుత్వ ఉత్తర్వులపై జాక్టో చైర్మన్‌ కేశవరపు జాలిరెడ్డి, సెక్రటరీ జనరల్‌ మల్లు శ్రీధర్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్రంలోని పదో తరగతి పాసైన బడుగు, బలహీన, ప్రత్యేకంగా మహిళా విద్యార్థులకు కళాశాల విద్య చేరువవుతుందన్నారు. గ్రేడ్‌ 2 ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి గ్రేడ్‌ 1 ప్రధానోపా ధ్యాయులుగా, స్కూల్‌ అసిస్టెంట్లు గా పనిచేస్తున్న పీజీ అర్హత గల సీనియర్లకు పీజీటీలుగా త్వరలో పదోన్నతులు లభించనున్నాయని తెలిపారు.

విప్లవాత్మక నిర్ణయం: ఎన్టీఏ

ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రతి మండలంలో మహిళా జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనమని, విప్లవాత్మక నిర్ణయమని నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాసరావు అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement