Saturday, April 27, 2024

బుచ్చయ్య రాజీనామా చేస్తారో లేదో కానీ.. అది నిజం

టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయనున్నారనే వార్త టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ క్రమంలో ఆయనను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ‘’బుచ్చయ్య రిజైన్ చేస్తారో లేదో గాని ఆయన చెప్పిన నిజాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కొని పొరపాటు చేశారని తప్పు బట్టానని చెప్పారు. అలా నిలదీసినందుకు బాబు తనతో రెండేళ్లు మాట్లాడలేదట. ప్రజలు బాబును ఐదేళ్లు తరిమారు. సూపర్ తీర్పు కదా!’’ అని విజయసాయి వ్యాఖ్యానించారు.

‘’ప్రజల మధ్యకు వెళ్లడం, పార్టీని బలోపేతం చేయడం అంటే శవ యాత్రలు కాదు మాలోకం. ఏ సమస్య లేని దగ్గర నలుగురిని వెంటేసుకుని అలజడి చేసి రాగానే పరిస్థితి మారదు. నువ్వు కాలు పెట్టిన చోటే సొంత పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. నాయకుడిగా నిన్నెవరూ గుర్తించడం లేదు. తెలుస్తోందా?’’ అంటూ నారా లోకేష్ ను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండిః ఏపీలో మరో అమానవీయ ఘటన.. రక్షించాల్సిన పోలీసే రక్షసుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement