Thursday, May 2, 2024

తాలిబన్ల వెబ్ సైట్ నిలిపివేత..

తాలిబన్లు పలు వెబ్ సైట్లు, సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తమ బాణి వినిపించేవారు. కాని నిన్నటి నుంచి తాలిబన్ వెబ్ సైట్లు మూగబోయాయి. తాలిబన్లు ప్రధానంగా ఐదు భాషల్లో వెబ్ సైట్ల ద్వారా తమ భావజాల వ్యాప్తి, ప్రకటనలు చేస్తుంటారు. పష్తో, ఉర్దు, అరబిక్, ఇంగ్లీషు, దరీ భాషల్లో తాలిబన్లు వెబ్ సైట్లను నిర్వహిస్తున్నారు. ఈ వెబ్ సైట్లు శుక్రవారం నుంచి ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోయాయి. తాలిబన్ల వెబ్ సైట్ల కార్యకలాపాలు నిలిచిపోవడం మంచి పరిణామమేనని మీడియా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాలిబన్లు తమ భావజాలంతో ప్రజలనే కాకుండా అల్ ఖైదా, తదితర అతివాద ఇస్లామిక్ సంస్థలను కూడా ప్రేరేపించగలరని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: కేంద్రం అలా చేస్తే పెట్రోల్ రూ.32 కే వస్తుందట..

Advertisement

తాజా వార్తలు

Advertisement