Sunday, May 5, 2024

కేంద్రం అలా చేస్తే పెట్రోల్ రూ.32 కే వస్తుందట..

దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లపై సామాన్య ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్ ధరలపై నిరసనలు సైతం వ్యక్తం చేస్తున్నారు. కాగా పెట్రోల్ రేట్ల పై కేంద్ర మాజీ మంత్రి పి. చిందంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం సెస్‌ను తగ్గిస్తే పెట్రోల్ రేట్లు బాగా తగ్గుతాయని చిదంబరం వ్యాఖ్యనించారు. పెట్రోల్‌పై సెస్‌ రూపంలో కొన్ని సందర్భాల్లో కేంద్రం సొమ్మును వసూలు చేస్తోందని, సెస్‌ అనేది పన్ను కాదని గుర్తించాలని చిదంబరం అన్నారు. కేంద్రం ఇలా ఆయా సమయాల్లో వేసిన సెస్‌ను తొలగిస్తే పెట్రోల్‌ లీటరు రూ.32కే ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు.

నిన్న హైదరాబాదలోని పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన సెమినార్‌కు హాజరయిన ఆయన అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. నోట్ల రద్దు అనే మోదీ ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినా అమలులో వెనుకబడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. నల్లధనం వెలికితీత పేరుతో నోట్లరద్దు అమల్లోకి తేగా, బ్లాక్‌మనీ మొత్తం వైట్‌గా మారిందన్నారు. తనకు దివంగత ప్రధాని పీవీ నరసింహారావుతో ఉన్న అనుబంధాన్ని చిదంబరం గుర్తుచేసుకుంటూ.. ఓసారి తాను రూపొందించిన ఓ ముసాయిదా చట్టం ఫైలును పీవీ కనీసం చదవకుండానే సంతకం పెట్టారని అన్నారు. 

ఇది కూడా చదవండి: వ్యాక్సిన్ వేసుకోకపోతే పబ్లిక్ ప్లేసులలో అనుమతి నిరాకరణ!

Advertisement

తాజా వార్తలు

Advertisement