Friday, April 26, 2024

వ్యాక్సిన్ వేసుకోకపోతే పబ్లిక్ ప్లేసులలో అనుమతి నిరాకరణ!

తెలంగాణ సర్కార్‌ వ్యాక్సిన్ వేసుకోనివారికి షాకింగ్ న్యూస్ చెప్పింది. 18ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తోంది. లేకపోతే పబ్లిక్ ప్లేస్ లలో తిరిగేందుకు అనుమతి ఉండకపోచ్చంటోంది. తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో.. కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం వైరస్ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయితే థర్డ్ వేవ్ వస్తుందన్న నేపథ్యంలో వైరస్ విషయంలో ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దంటున్నారు వైద్యాధికారులు. మాస్క్ లు, ఫిజికల్ డిస్టెన్స్.. శానిటైజర్లను తప్పకుండా మెయింటైన్ చేయాని సూచిస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని ప్రకటించిన రాష్ట్ర వైద్యశాఖ.. థర్డ్ వేవ్ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. వైరస్ వ్యాప్తి బలహీనపడటంతో సెకండ్ వేవ్ ముగిసినట్టేనని తెలంగాణ వైద్యశాఖ అధికారులు ప్రకటించారు. మొదటి.. సెకండ్ వేవ్ ల్లో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు లక్షల 53 వేల మందికి కరోనా సోకింది. దాదాపు నాలుగువేల మంది వైరస్ తో పోరాడి మృతి చెందారు. రాష్ట్రంలో సగభాగం వ్యాక్రినేషన్ పూర్తయిందంటున్న అధికారులు.. ఇప్పటివరకు కోటీ 65 లక్షలమందికి వాక్సిన్ ఇచ్చినట్టు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: యువతుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యాయత్నం

Advertisement

తాజా వార్తలు

Advertisement