Monday, March 25, 2024

మహేష్‌బాబు విడుదల చేసిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్

సుధీర్‌బాబు, ఆనంది జంటగా తెరకెక్కిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ ట్రైలర్‌ను గురువారం నాడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు విడుదల చేశాడు. ప్రేమ, పెళ్లి.. ఈ మధ్యలో పరువు సృష్టించే గొడవలు ఈ ట్రైలర్‌లో చూపించారు. ప్రేమకు పెద్దలు ఎదురుతిరగడం .. కథానాయకుడు తన ప్రేమకోసం ఎంతకైనా తెగించడం ట్రైలర్‌లో ఆవిష్కరించారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. కంటెంట్ చూస్తుంటే యూత్‌ను, మాస్‌ను ఒక రేంజ్ లోనే ఆకట్టుకునేలా అనిపిస్తోంది.

విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ మూవీకి కరుణకుమార్ దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో సూరిబాబు, శ్రీదేవి అనే జంట మధ్య సాగే అందమైన ప్రేమకథ ఇది. ఈ సినిమా ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది.

YouTube video

ఈ వార్త కూడా చదవండి: ‘టక్ జగదీష్’ ఓటీటీ రిలీజ్ ఖరారు.. స్పందించిన హీరో నాని

Advertisement

తాజా వార్తలు

Advertisement