Sunday, December 8, 2024

ఎమ్మెల్సీ రేసులో చ‌ల్లా త‌న‌యుడు..

కర్నూలు : మాజీ ఎమ్మెల్సీ, దివంగత చల్లా రామకృష్ణారెడ్డి రెండో కుమారుడు చల్లా భగీరథరెడ్డి ఎమ్మెల్సీ రేసులోకి వ‌చ్చారు.. ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి జనవరి 1వ తేదీన కరోనాతో మృతి చెందారు. అనంతరం సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అవుకుకు వచ్చి చల్లా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంలోనే చల్లా భగీరథరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినట్లు స‌మాచారం.. ఈ నేప‌థ్యంలో. ఈనెల 25న ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌ వెలువడనుండడంతో వైసీపీ అధినాయకత్వం చల్లా భగీరథరెడ్డి పేరు పరిశీలిస్తున్న‌ది.. దాదాపు ఆయ‌న అభ్య‌ర్ధిత్వాన్ని జ‌గ‌న్ ఖ‌రారు చేశార‌ని టాక్..

Advertisement

తాజా వార్తలు

Advertisement