Friday, April 26, 2024

ఎమ్మెల్సీ కొంటే సీఎం కావ‌డం క‌లే – చంద్రబాబుకి ప్ర‌స‌న్న కౌంట‌ర్

బుచ్చిరెడ్డిపాలెం మార్చి 29 ప్రభ న్యూస్ ఎమ్మెల్సీలనుకుంటే ముఖ్యమంత్రి అవుతానని నారా చంద్రబాబు నాయుడు కలలు కంటున్నార‌ని కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మండల పరిధిలోని పెనుబల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 53 సచివాలయ పరిధిలో 58 వేల 646 గడపలు తిరగడం జరిగిందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అవ్వ తాతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అన్నారు. ముందు చూపుతో ముఖ్యమంత్రి జగన్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పెట్టడం ఎంతో అభినందనీయం అన్నారు.

ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఇప్పుడు దాకా లబ్ధిదారులకు అందించిన సంక్షేమ పథకాలను చెప్పడం వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. పార్టీలు కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. మహిళలు మళ్లీమళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తామంటూ హామీ ఇస్తున్నారు అన్నారు. చంద్రబాబు లాగ కాకుండా ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారన్నారు. మోసానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని దుయ్యబట్టారు.

హైదరాబాదులో టిడిపి నాయకులు పోలిట్ బ్యూరో సమావేశం పెట్టుకొని కొత్త డ్రామాకు తెరలేపారు అన్నారు. వైయస్సార్సీపి ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి జగన్ పై అసంతృప్తితో ఉన్నారని, 40 మంది టీడీపీతో టచ్ లో ఉన్నారంటూ అసత్య ప్రచారాలు చేశారన్నారు. దమ్ముంటే మెదడులేని అచ్చం నాయుడు ఆ 40 మంది పేర్లు బయట పెట్టాలన్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడించే మైండ్ గేమ్ తప్ప మరేం కాదన్నారు. ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేస్తున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఒక్కరు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేరన్నారు. డబ్బుకి కక్కుర్తి పడ్డ ఒకళ్ళిద్దరు మినహా ఎవరు పార్టీ వీడరు అన్నారు. తనది రాజకీయ కుటుంబం అయినప్పటికీ జగన్ బొమ్మతో తాను గెలిచాను అన్నారు. జగన్ బొమ్మ చూసే రాష్ట్ర ప్రజలందరూ ఓటేశారన్నారు. మూడున్నర సంవత్సరకాలంలో 1,95,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య మంత్రి జగన్ ఖర్చు పెట్టారన్నారు. ప్రజల ఆశీస్సులే తమకు శ్రీరామరక్ష అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం తమకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గాని ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినవారు ఎవరూ లేరన్నారు. తాను మళ్ళీ చెబుతున్నానని అసత్య వార్తలు రాసిన ప్రచారం చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ ఎలా ఆదేశిస్తే అలా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను అన్నారు. ఒకవేళ కొవూరు నియోజకవర్గంలో ఎవరినైనా నిలబెట్టి గెలిపించమంటే ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లే తాను నడుచుకుంటానన్నారు. ముఖ్యమంత్రి జగన్ తమను ఎంతో బాగా చూసుకుంటున్నారని పార్టీ విడాల్సిన అవసరం లేదన్నారు. తనను తన కుమారుడు రజితను ఎంతో అభిమానిస్తారన్నారు. మా చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకు పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు.
ఈ కార్యక్రమంలో ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి సురా శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు చెర్లో సతీష్ రెడ్డి, జొన్నవాడ దేవస్థానం చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు,పెనుబల్లి సర్పంచి పెంచలయ్య జొన్నవాడ ప్రసాద్, పిల్లిల మోహన మురళీకృష్ణ, ముంగర శివ, గుమ్మా రఘురామయ్య, జయరాం రెడ్డి, సన్నపురెడ్డి నరసింహారెడ్డి, ఏపీఎం లలిత వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement