Thursday, April 25, 2024

హానీ రోజ్ నోట – పెళ్లి మాట

వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ అభినయం చూసి స్పం దించినట్టుగానే అందులో నటించిన నటి హానీరో జ్‌ అందం చూసి ఆహా అన్న ప్రేక్షకులు ఉన్నా రు. కొంత గ్యాప్‌ తర్వాత హానీ తెలు గులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె పర్‌ఫార్మె న్స్‌కు జనం ఫిదా అయ్యారు. మీనాక్షి పాత్రల్లో ప్రత్యేకంగా కనిపించిన హానీ రోజ్‌ పెళ్లికి సిద్దమైందనే వార్త షికారు చేస్తోం ది. 31 ఏళ్ల వయసున్న ఈ మళయాలి భామ కొద్ది సంవ త్సరాల క్రితమే తెలుగు సినిమాల్లో నటించింది. మళయాలంలో అరంగేట్రం చేసింది తెలుగులో ఆలయం అనే సినిమా ద్వారా టాలీ వుడ్‌లో అడుగుపెట్టింది. ఈ సిని మా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో హానీకి ఆశించిన గుర్తింపురాలేదు. బాలకృష్ణ సినిమాల్లో ఆయనకు తగిన నాయికలను అన్వేషిస్తూ హానీరోజ్‌ను ఎంపికచేశారు. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. బాలయ్యకు తల్లిగా, భార్యగా రెండు పాత్రల్లో వైవి ధ్యం ప్రదర్శించింది. హానీ రోజు గురించి పలు ఆసక్తికరమైన కథనాలున్నాయి. వీటిలో ముఖ్యమైనది ఆమె పెళ్లి గురించి. దీనిపై హానీ స్పందించింది. పెళ్లికి సిద్దంగా ఉన్నట్టు చెబుతూనే అది ఓ పెద్ద బాధ్యతగా పేర్కొంది. అలాగే తనకు నటనపై కూడా ఆసక్తి ఉందని అంటోంది. సమయం వచ్చినప్పుడు మరింత స్పష్టత ఇస్తుందని భావించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement