Wednesday, May 1, 2024

పంట నష్టంపై నివేదిక అందించండి: ఎమ్మెల్యే కోనేటి

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నష్టంపోయిన పంట నష్టంపై నివేదిక సిద్ధం చేసి అందించాలని అధికారులకు సత్యవేడు ఎమ్మోల్యే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో పంట నష్టంపై పిచ్చాటూరు తహశీల్దార్ టి.వి.సుబ్రమణ్యం, ఏవో కోదండయ్యతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో వర్షాలకు నష్టపోయిన  పంటలు వివరాలు  క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సిద్ధం చేసి ఇస్తే ఉన్నత అధికారులుతో మాట్లాడి రైతులు సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. మూడియారు, బంగాళా, పులికుండ్రరం, కారూరు, అడవికోడియంబేడు, పిచ్చాటూరు శేషంబెడు, రామగిరి , రాజనగరం, రామాపురం, వేలూరు, హనుమంత పురం అప్పులరాజు కండ్రిగ గోవర్దగిరి సిద్దిరాజు కండ్రిగ పంచాయతీల్లో పంట నష్టం జరిగినట్లు కధనాలు వస్తున్న నేపధ్యంలో  ఎమ్మెల్యే స్థానిక అధికారులతో పంట నష్ట నివారణ పై నివేదిక కొరడంపట్ల మండల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి 

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement