Monday, May 6, 2024

పాము కాటుకు గురైన విద్యార్థులకు మంత్రి పరామర్శ

విజయనగరం జిల్లా కురపాంలోని జ్యోతిబా పూలే హాస్టల్ లో పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ పరామర్శించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.  ఈ ఘటన దురదృష్టకరం అని మంత్రి అన్నారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి అయిదు లక్షలు పరిహారం అందించినట్లు చెప్పారు. ఇద్దరు విద్యార్థుల వైద్యానికి అయిన ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ప్రిన్సిపాల్ సకాలంలో‌ స్పందించారని, ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పాము ఎలా వచ్చిందో తెలియడం లేదని, దీనినపై ఎంక్వాయిరీకి చేయమని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వం హాస్టళ్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందన్నారు. కురపాంలో నూతన భవనాన్ని నిర్మించనున్నామని, ఇందుకు స్థల సేకరణ చేయమని కలెక్టర్ అని ఆదేశించినట్లు మంత్రివేణు గోపాల కృష్ణ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement