Friday, April 26, 2024

శంక‌ర్ డైరెక్ష‌న్ లో రామ్ చ‌ర‌ణ్ మూవీ – స‌ర్కారోడు టైటిల్ ప‌రిశీల‌న‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో ఓ మూవీని చేస్తున్నారు. కాగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుంది. ఈ సినిమా కెరియర్ పరంగా చరణ్ కి 15వ సినిమా. ఇక దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న 50వ సినిమా ఇది. ఇలా ఈ సినిమా మరో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తోంది. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్ గా న‌టించ‌నుంది. ‘వినయవిధేయరామ’ తరువాత చరణ్ జోడీగా ఆమె చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం ‘సర్కారోడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ టైటిల్ గురించిన విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement