Sunday, May 5, 2024

ర‌ష్మిక మంద‌న్న హిందీ చిత్రం రిలీజ్ డేట్ ఎనౌన్స్

బాలీవుడ్ లో మిష‌న్ మ‌జ్ను చిత్రంలో న‌టించింది హీరోయిన్ ర‌ష్మిక మంద‌న‌. ఇది ఆమెకి హిందీలో ఫ‌స్ట్ మూవీ.బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రకి జోడీగా రష్మిక ఈ సినిమాలో నటించింది. శంతను దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కొంతసేపటి క్రితం ప్రకటించారు. జూన్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నామని చెబుతూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రష్మిక, ‘మిషన్ మజ్ను’ కూడా తప్పకుండా హిట్ అవుతుందనే బలమైన నమ్మకంతో ఉంది. ఈ సినిమా తరువాత బాలీవుడ్ లోను బిజీ అవుతానని భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement