Monday, May 6, 2024

‘ఆల్ట్రా మోడ్రన్ కిచెన్’.. క్షణాల్లో భోజనం సిద్ధం

శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ‘ఆల్ట్రా మోడ్రన్ కిచెన్ ను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతతో అరబిందో ఫార్మసీ ఫౌండేషన్ రూ. 2 కోట్లు మంజూరు చేసి, అధునాతన స్టీమ్, గ్యాస్ పైపు లైన్, స్టౌలు, కుక్కర్లు, వంట పాత్రలు ఏర్పాటు చేసింది. తక్కువ ఖర్చుతో ఎక్కువమందికి క్షణాల్లో భోజనం, అల్పాహారం తయారు చేసేలా దీన్ని తీర్చిదిద్దారు. 300 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసేందుకు డైనింగ్ లు, మంచినీటి కోసం ప్రత్యేకంగా ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఇంజినీర్ల పర్యవేక్షణలో కిచెన్ మెరుగులు దిద్దారు.

ప్రస్తుతం వర్సిటీలో పురుషులు, మహిళల వసతి గృహాల్లో 600 మంది విద్యా ర్థులు ఉంటున్నారు. ఒక్కో విద్యార్థికి ప్రతి నెల రూ. 1500 నుంచి రూ. 2 వేల వరకు బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. గ్యాస్ ధరల వల్ల మెస్ బిల్లులు ఎక్కువ వస్తు న్నాయి. కొత్త కిచెన్ వల్ల గ్యాస్, విద్యుత్ వినియోగం భారీగా తగ్గనుంది. ఫలితంగా విద్యార్థులకు మెస్ చార్జీల భారం కూడా తగ్గనుంది. ఈ కార్యక్రమంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement