Saturday, April 27, 2024

Breaking: లవ్ మ్యారేజ్ చేసుకుందని.. చెల్లిపై కత్తితో అటాక్ చేసిన అన్న..

లవ్ మ్యారేజీ చేసుకుందన్న కోపంతో అన్న చెల్లెలిపై కత్తితో దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన యువతి, కోవూరు మండలానికి చెందిన యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో నిన్న గుడిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. అనంతరం తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు.

దీంతో ఎస్ఐ వెంకటేశ్వరరావు వారిని మంగళవారం ఉదయం రండి.. ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడతానని చెప్పి పంపించారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం వారు స్టేషన్ కి వచ్చారు. అదే సమయంలో యువతి అన్న అక్కడికి చేరుకుని కత్తితో అటాక్ చేశాడు. తీవ్రంగా గాయపడ్డ యువతని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోవూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement