Monday, May 6, 2024

Lepakshi – వీర‌భ‌ద్ర‌స్వామి సేవ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ….

పెనుకొండ: శ్రీ సత్యసాయి జిల్లాలో లేపాక్షి ఆలయాన్ని సంద‌ర్శించారు ప్ర‌ధాని మోడీ.. అక్కడ వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకులు ప్రధానికి వివరించారు. అంత‌కు ముందు పుట్ట‌ప‌ర్తి విమానాశ్ర‌యానికి చేరుకున్న ప్ర‌ధానికి ఘన స్వాగతం లభించింది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ,డిఐజి అమ్మి రెడ్డి, పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబులపతి, పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ, బిజెపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, పార్థసారథి, శ్రీసత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్.జె. రత్నాకర్ ఎయిర్‌పోర్ట్‌ భద్రత అధికారి తదితరులు ప్రధానిని కలిసి పుష్పగుచ్చాలను స్వాగతం పలికారు.

కాగా, గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం వద్ద రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ (నాసిన్‌) ఏర్పాటవుతోంది. కాసేపట్లో ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రధాని మ‌రికొద్దిసేప‌టిలో ప్రారంభించనున్నారు. 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మాణం పూర్తి చేశారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడి నుంచి గంటలో చేరుకునేంత దూరం ఉండటం కలిసొచ్చే అంశం. ఐఏఎస్‌లకు ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్‌ తరహాలో ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌)కు ఎంపికైనవారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. కాగా, ఈ కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ న‌జీర్ , ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ లు కూడా పాల్గొన‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement