Monday, May 6, 2024

Admissions – లాస్ట్ చాన్స్‌! ఈ ఏడాదితోనే ఆఖ‌రు

తెలంగాణ విద్యసంస్థల్లో అపురూప వృత్తి విద్య కోర్సుల్లో చేరేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్లో మక్కువ పెరిగింది. పదేళ్లుగా ఉమ్మడి వారసత్వం అనుభవించిన ఏపీ విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరంతో గేటుకు తాళాలు పడనున్నాయి. ఈ తరుణంలో ఏపీ విద్యార్థులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. తెలంగాణ ఎంసెట్, పీజీసెట్, పాలిసెట్ పరీక్షల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సర్వసన్నద్ధమవుతున్నారు. దీంతో ఇబ్బడి ముబ్బడిగా దరఖాస్తులు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలోనూ ఏపీ విద్యార్థులు కిటకిటలాడే పరిస్థితి నెలకొంది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వినియోగించుకోవటమే కాదు.. ఇక్కడి ఉన్నత విద్యాసంస్థల్లోనూ చదువుకునే అవకాశాన్ని ఏపీ విద్యార్థులకు కల్పించారు. దీంతో పదేళ్లుగా ఏపీ విద్యార్థులు తెలంగాణ విద్యసంస్థల్లో తమకు ఇష్టమైన కోర్సుల్లో చేరుతున్నారు. ఇక‌.. సీన్ మారినట్టే..

కాగా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే విద్యార్థులకు 2024 జూన్ 2 నుంచి తెలంగాణ విద్యాసంస్థల్లోని వృత్తి విద్య కోర్సుల్లో ఉమ్మడి అడ్మిషన్లు ఉండవు. ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియ నోటిఫికేషన్లు జూన్ ముందే ఉండటంతో.. ఈ విద్యా సంవత్సరంలోనే ఏపీ విద్యార్థులకు చివరి అవకాశం లభించింది. వ‌చ్చే ఏడాది సీన్ మారిపోనుంది. పదేళ్ల ఉమ్మడి వారసత్వానికి తెర పడినట్టే.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ష జరిపారు. సీట్లు కోల్పోతున్న తెలంగాణ విద్యార్థులుతెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్వహిస్తున్న మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో చేరటానికి, అలాగే అత్యధిక విద్యార్థులు టీఎస్ ఈఏపీసెట్ పరీక్షకు హాజరవుతున్నారు. దీంతో మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో తెలంగాణ విద్యార్థులు తమ సీట్లను కోల్పోతున్నారు. 2021 నుంచి గణాంకాలను పరిశీలిస్తే… టీఎస్ఈఏపీసెట్ లో ఏపీ విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. 2021లో 51,848 ఏపీ విద్యార్థులు దరఖాస్తు చేస్తే.. 2022లో ఈ సంఖ్య 53,931కి, 2023 నాటికి 56,374 మందికి చేరింది.ఈ పరిస్థితిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్యవస్థీకరణ చట్టం అమలుకు రంగం సిద్ధం చేసింది.

పదేళ్ల చట్టం.. గేట్లకు తాళం

- Advertisement -

ఈ చట్టం ప్రకారం.. 2014 ముందు ఏపీలో అమలు జరిగిన చట్టమే పదేళ్లపాటు కొనసాగించారు. 2014 జూన్ 2 నుంచి రాజ్యాంగంలోని 371డీ ఆర్టికల్ ప్రకారం ఉమ్మడి అడ్మిషన్లను అమలును తప్పని సరి చేశారు. దీంతో తెలంగాణ విద్యాసంస్థల్లో ఏపీ విద్యార్థులకు సమాన అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీ పరిధిలో తెలంగాణ విద్యార్థులకు 85 శాతం స్థానిక కోటా అమలు జరుగుతుంది. 15 శాతం స్థానికేతర కోటా అమలు జరుగుతుంది. ఈ 15 శాతంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుతో పాటు తెలంగాణ విద్యార్థులకూ అవకాశం ఉంటుంది. ఇదే విధానం ఏపీలోనూ అమలు జరుగుతోంది. ఈ స్థితిలో ఏపీ విద్యార్థులకు ఉమ్మడి వారసత్వం ఇక ఉండదు. ప్రస్తుతం తెలంగాణలోని వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ తేదీలను ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement