Monday, May 20, 2024

ఊపిరి ఉన్నంత వరకు జగన్ వెంటే సిద్దార్థ‌రెడ్డి : దాసి సుధాకర్ రెడ్డి

నందికొట్కూరు : రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పై రాజకీయంగా ఎదుర్కోలేక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటామని నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి స్వగృహంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో త‌మ‌ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి ఎన్నికల ముందు ఎలాగైతే సిద్దార్థను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని మాటిచ్చారో.. ఆ మాట ప్రకారం మాట తప్పని మడమ తిప్పని నేతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మన జగనన్న ఇచ్చిన మాట ప్రకారమే సిద్దార్థ రెడ్డికి శాప్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారన్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు జగనన్న అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా శాప్ చైర్మన్ గా నిజాయితీగా రాష్ట్రం నలుమూల‌ల్లో సైతం వెళ్తూ క్రీడాకారులను అభివృద్ధి చేస్తూ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కర్నూలు జిల్లాలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో యూత్ ఐకాన్ గా, యూత్ బ్రాండ్ అంబాసిడర్ అయిన త‌మ సిద్దార్థ రెడ్డిని తట్టుకోలేక మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయిన ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు ప్రారంభించి సిద్దార్థ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తుందన్నారు. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, చంద్రబాబు ప్యాకేజీకి అమ్ముడుపోయిన ఎల్లో మీడియా ఎన్ని కథనాలు ప్రసారం చేసినా ఎవరూ నమ్మొద్దన్నారు. రాష్ట్రంలో ఉన్న వైకాపా నాయకులు, జగనన్న అభిమానులు, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అభిమానులు ఎవరూ తప్పుడు ప్రచారాలు నమ్మకండని అన్నారు. బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ముద్దపప్పు నారా లోకేష్ ను కలవలేదు, చంద్రబాబును కలవలేదు.. ఎవరు ప్రచారం చేసినా నమ్మవ‌ద్ద‌న్నారు. కొందరు వ్యక్తులు టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చి నిజమైన వైకాపా నేతల ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్నారన్నారు. వారికి కూడా త్వరలోనే పుల్ స్టాప్ పెడతామన్నారు. ఎల్లో బ్రదర్స్ కు తాను ఒక్కటే చెబుతున్నాను. మీరు ఎన్ని ప్రచారాలు చేసినా.. ఎన్ని ఆరోపణలు చేసినా జగనన్న అంత సులువుగా మిమ్మల్ని నమ్మరన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement