Friday, May 3, 2024

కాంట్రాక్టర్ వేధింపుల నుంచి రక్షణ కల్పించండి..

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్వీపర్లు ఇతర పారిశుద్ధ్య సిబ్బంది పై ఆస్పత్రి అధికారులు అదేవిధంగా కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి వేధింపులు ఎక్కువయ్యాయని ఈ నేపథ్యంలోనే సఫాయి కర్మచారి సంఘం జాతీయ కమిషన్ ఛైర్మన్ వెంకటేశం కు తమ గోడును వెళ్లబోసుకున్నారు సఫాయి కర్మచారి సేవా సమితి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శానిటరీ సూపర్వైజర్ శారద, సంఘం నాయకులు బాబుజి, బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, సఫాయి కర్మచారి సేవా సమితి కార్యదర్శి మంజుల వాణి తదితరులు మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయితే పోలీసులు నామమాత్రపు విచారణ చేసి శ్రీనివాస్ రెడ్డిని వదిలేసినట్లు వదంతులు వస్తున్నాయని జె పి ఎస్ ఎస్ సి మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు విమర్శించారు. జాతీయ కమిషన్ చైర్మన్ ఆదేశాలు జారీ చేస్తే పోలీసులు నామమాత్రపు విచారణ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఏవన్ సెక్యూరిటీ ఏజెన్సీ కి చెందిన శ్రీనివాసరెడ్డి మహిళల పట్ల అదే విధంగా పారిశుద్ధ్య సిబ్బంది పై అనుచితవ్యాఖ్యలు చేస్తూ రిటైర్మెంట్ వయసు పూర్తయిన వారిని ఇంకా కొనసాగిస్తూ వారిని అడ్డం పెట్టుకొని నాన్న అరాచకాలు చేస్తున్నాడని ఆరోపించారు. కేసు రిజిస్టర్ అయిన సందర్భంలో సదరు మహిళలు ఇతర సిబ్బందికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కు రావాలంటూ బెదిరించడం జరిగిందని తమవద్ద ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి కి చెందిన మంది వ్యక్తులు విధులు నిర్వహించకుండా జీతాలు పొందుతున్నట్లు విమర్శించారు నిజంగా పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వేధిస్తూ తమ వారికి మాత్రం పనిచేయకుండా జీతాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వాసుపత్రి సిఎస్ఆర్ఎం ఒగా పనిచేస్తున్న హేమమాలిని కు గతంలో ఒక విలువైన కారును బహూకరించినట్లు ఆరోపించారు అదేవిధంగా ఆస్పత్రి సిబ్బంది పని చేయకుండా కూడా కొంత మంది పేర్లతో జీతాలు తీసుకుంటూ అందులోని కొంత మొత్తాన్ని ఆమె అందజేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి పూట కూడా వైద్యురాలు హేమనలిని ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నట్లు అనేక మంది సిబ్బంది చెబుతున్నారని పేర్కొన్నారు రోగులకు వైద్యం చేయాలని వైద్యులు అర్ధరాత్రి పూట ప్రభుత్వాసుపత్రిలో ఏమి పని అని ప్రశ్నించారు. ఎన్ని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వాస్పత్రి ఉన్నతాధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కళ్ళు మూసుకొని చోద్యం చేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు. పైన జరుగుతున్న అక్రమాలు ఆరోపణలపై వెంటనే స్పందించి విచారణ చేపట్టి శ్రీనివాస్ రెడ్డి పై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేసి రిమాండ్కు పంపాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తొలగించిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement