Thursday, April 25, 2024

రైతులకు అండగా ప్రభుత్వం – మంత్రి సీదిరి

శ్రీకాకుళం, : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మంగళవారం రైతులకు సున్నావడ్డి పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతులకు అండగా ఉంటూ రైతు భరోసా కార్యక్రమం, రైతులకు ఉచిత పంటల బీమా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పెట్టుబడి రాయితీ తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు కల్పించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కస్టమ్ హైర్ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లను అందుబాటులో పెట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మల్టీపర్పస్ కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు విరాజిల్లుతున్నాయని పేర్కొంటూ రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, కల్లాల వద్దనే ధాన్యాన్ని సేకరించడం జరుగుతోందని అప్పలరాజు పేర్కొన్నారు. విత్తన దశ నుండి పంట చేతికి అంది వచ్చే వరకు రైతులకు అవసరమగు అన్ని కార్యక్రమాలను ముఖ్యమంత్రి చేపడుతున్నారని, రాష్ట్రంలో లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారని ఆయన తెలిపారు. సున్నావడ్డి కార్యక్రమం క్రింద శ్రీకాకుళం జిల్లాలో 68,401 మంది రైతులకు రూ.6.04 కోట్లు సున్నా వడ్డిగా జమ అయిందన్నారు. పలాస నియోజకవర్గంలో పలాస మండలంలో 264 మంది రైతులకు రూ.4.40 లక్షలు.,
మందస మండలంలో 2236 మంది రైతులకు రూ.17.31 లక్షలు., వజ్రపు కొత్తూరు మండలంలో 1561 మంది రైతులకు రూ.18.74 లక్షలు వెరసి 4061 మంది రైతులకు రూ.40.42 లక్షలు.,అందించినట్లు మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement