Monday, April 29, 2024

RIP – అమ‌ర జ‌వాన్ కు క‌న్నీటితో ఆఖ‌రి వంద‌నం …

క‌ర్నూలు – జమ్ము కాశ్మీర్లో విధులు నిర్వహిస్తూ ఉగ్రవాదుల దాడిలో అమరుడైన ఆర్మీ జవాన్ సిరిగిరి సురేంద్ర అంత్యక్రియలు పూర్తి సైనిక లాంచ‌నాల‌తో బుధవారం ముగిశాయి. నందికొట్కూరు నియోజకవర్గం,స్వగ్రామం పాములపాడు మండలం, కృష్ణ నగర్ గ్రామంలో సురేంద్ర పార్థివదేహానికి రాజకీయ నాయకులు, వామపక్ష సంఘ నాయకులు నివాళులర్పించారు.

అంత్యక్రియలకు ప్రజలు భారీగా హాజరయ్యారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసారు… దేశ సేవ‌లో అమ‌రుడైన సురేంద్ర‌కు అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన అధికార‌,రాజ‌కీయ‌, స్థానిక ప్ర‌ముఖులు, ప్ర‌జ‌లు క‌న్నీటితో క‌డ‌సారి విడ్కోలు ప‌లికారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement