Saturday, April 27, 2024

KNL: స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి.. కలెక్టర్ సృజన

కర్నూలు ప్రతినిధి, జనవరి 8 : స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… స్పందన అర్జీలను ఎప్పటికప్పుడు నాణ్యతతో, గడువు లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.. అర్జీదారునితో మాట్లాడి సంతృప్తి చెందేవిధంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు..

పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి…
సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ నోడల్ ఆఫీసర్ లను ఆదేశించారు.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్, డోర్స్, కిటికీలు, విద్యుత్, లైట్లు, ఇంటర్నల్ వైరింగ్, పవర్ సప్లై కోసం సాకెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాడు-నేడు లో కవర్ కాని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని, అందుకు సంబంధించి నిధులు మంజూరు చేస్తానని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల విధులను నిర్వహించేందుకు సిబ్బంది వివరాలను గురువారం లోపు సమర్పించాలని మ్యాన్ పవర్ మేనేజ్ మెంట్ నోడల్ అధికారి (ఖజానా శాఖ డిడి) ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె.మధుసూదన్ రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, నాగప్రసన్న లక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement