Friday, April 26, 2024

కర్నూలు జిల్లాలో ఆశ్చర్యానికి గురిచేస్తున్న పచ్చకప్పలు

కర్నూలు జిల్లాలో బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో కుంటలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఇదే క్రమంలో సి.బెళగల్ మండలం బురాన్ దొడ్డిలో కుంటలు నిండిపోయాయి. దీంతో కుంటల్లోకి అరుదైన పచ్చకప్పలు వచ్చి చేరాయి. కుంటలో ఎటుచూసిన పచ్చకప్పలే దర్శనమిస్తున్నాయి. గురువారం ఉదయం కుంట వైపు వచ్చిన గ్రామస్తులు పచ్చకప్పలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. కొందరు భారీ వర్షాన్ని లెక్కచేయకుండా వీటిని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే ఈ పచ్చకప్పలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియక గ్రామస్తులు ఆలోచనలో పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement