Wednesday, June 16, 2021

ప్రభాస్ రెడి…షూట్ ఎప్పటినుంచో తెలుసా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్,సలార్,ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు. ఈ మూడు కూడా పాన్ ఇండియా చిత్రాలుగా తలెత్తుతున్నాయి. అలాగే వీటితో పాటు నాగ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఇందులో ఆదిపురుష్, రాధేశ్యామ్ ,సలార్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. కాగా కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాలు షూటింగ్ ను నిలిపివేసుకున్నాయి.

అయితే ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టటంతో మళ్లీ ప్రభాస్ ఆ మూడు చిత్రాల షూటింగ్ కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తాజాగా వచ్చిన సడలింపు లతో చిత్ర యూనిట్ షూటింగ్ ను రీ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తోందట. మరి ప్రభాస్ ఈ సినిమాలకు సంబంధించి షూటింగ్ మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Prabha News