Thursday, May 2, 2024

ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ తో రక్షణ ..

కర్నూలు, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు దిశా పోలీసుస్టేషన్ డిఎస్పీ వెంకట్రామయ్య ఈ రోజు కర్నూలు నగరంలోని కె వి ఆర్ కళాశాల లో దిశా మహిళా పోలీసులు మహిళల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, దిశా యాప్ ను డౌన్ లోడ్ చేయించడం , దిశా గస్తీ వాహనాల వల్ల మహిళల భద్రతకు భరోసా గురించి అవగాహన కల్పించారు. పాఠశాలలు, విద్యాసంస్థలు, కళాశాలల దగ్గర ఈవ్ టీజింగ్ , ఆకతాయిల వేధింపులు కట్టడికి దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని మహిళలు రక్షణ పొందాలని తెలిపారు. ఆపదలో ఉన్న మహిళలు దిశ యాప్ తో రక్షణ పొందే విధంగా విస్తృతంగా అవగాహన చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దిశా పోలీసుస్టేషన్ సిఐ ఓబులేషు , కె వి ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా శాంతి , బయో కెమిస్ట్రీ ఉమెన్ ఎంపవర్ మెంట్ అధ్యాపకురాలు ధనా శ్రీ, మహిళా పోలీసులు , 550 మంది కెవి ఆర్ కళాశాల విద్యార్దినిలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement