Thursday, May 16, 2024

కుందూ నది ఆధునీకరణ పనులపై రైతులకు స్పష్టత ఇవ్వండి : బొజ్జా దశరథరామిరెడ్డి

నంద్యాల : శ్రీశైలం రిజర్వాయర్ కు వరద వచ్చిన సందర్భంలో ఆ నీరంతా సముద్రం పాలు కాకుండా రాయలసీమకు నీరు మళ్ళించే లక్ష్యంతో, ఈ నీటిని మళ్ళించడం వలన రాయలసీమలోని పొలాలు మునిగి పోకుండా ఉండే లక్ష్యంతో కుందు నదిని వెడుల్పు, నది ఒడ్డులను ఎత్తు పెంచి బలోపేతం చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం చేస్తోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. కుందూ పరీవాహక రైతులకు నష్టం కలిగించవద్దని, ఈ ప్రాంత రైతులకు సాగునీరు, త్రాగునీరు అందించే చర్యలు కూడా చేపట్టాలని కోరారు. గురువారం కేసి.కెనాల్, ఈఈ ప్రతాప్, తెలుగుగంగ ఎస్ఐ కి కుందూ ఆధునీకరణ పనుల స్పష్టత కోసం బొజ్జా దశరథరామిరెడ్డి నాయకత్వాన రైతు ప్రతినిధులు వినతిపత్రాలను అందచేసారు. ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ… కుందు నది వెడల్పు కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా నుండి కడప జిల్లా వరకు అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో మొదలు పెట్టారనీ, ఈ నేపధ్యంలో కుందూ నది వెంట భూములు ఉన్న రైతులు, మనషుల, పశువుల తాగునీటికి, సాగు నీటికి, తదితర అవసరాలకు ఈ నది పై ఆధారపడిన వారు కుందు వెడెల్పు కార్యక్రమం పైన స్పష్టత కావాలని దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ రైతుల కోసం చేపడుతున్న కుందు నది వెడెల్పు కార్యక్రమం లో రాయలసీమ రైతాంగం కోరుకుంటున్న అంశాలపై స్పష్టత ఇస్తూ, కుందు నది వెడెల్పు పైన సమగ్ర ప్రణాళికను ప్రకటించాలని లేకుంటే కుందూ పరీవాహక రైతులతో ఉద్యమం చేస్తామని దశరథరామిరెడ్డి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement