Tuesday, April 30, 2024

Krishna – జ‌గ‌న‌న్న సుర‌క్ష‌పై క‌లెక్ట‌ర్ వీడియో కాన్ఫ్ రెన్స్ – స‌ర్వే వివ‌రాలు తెల‌పాల‌ని ఆదేశం..

మచిలీపట్నం జూన్ 28:- గ్రామాలు వార్డుల్లో పర్యటించి జగనన్న సురక్ష కార్యక్రమం సర్వే వివరాలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డి ఆర్ ఓ ఎం వెంకటేశ్వర్లు,జిల్లా అధికారులు క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్న సురక్ష కార్యక్రమం పై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామాలు వార్డుల్లో వాలంటీర్ల సర్వే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది ప్రజల అభిప్రాయం ఏమిటి సాంకేతిక పరంగా ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అనే విషయాలను గమనించి నివేదిక అందజేయాలని ఎంపీడీవోలు, తహసిల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, డివిజనల్ అధికారులు, మండల, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులను ఆదేశించారు.

వాలంటీర్లు ఇంటింటికి తిరిగి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తిస్థాయిలో ఒకేసారి సర్వే చేయాలన్నారు. గ్రామాల్లో సర్వే చేసే ముందు ప్రజల వద్ద అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని ముందుగా ప్రచారం చేయాలన్నారు. వాలంటీర్లు సర్వే పూర్తికాగానే తక్షణమే సచివాలయంలో టోకెన్లు జనరేట్ చేయడంతో పాటు సేవల అభ్యర్థనలను నమోదు చేయాలన్నారు.
ప్రజలకు కావలసిన వివిధ రకాల దృవపత్రాల జాబితాను సిద్ధం చేయాలన్నారు. అభ్యర్ధనలను సజావుగా విచారించుకొని తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉం టుందన్నారు. ప్రజలకు ఎన్ని ధ్రువపత్రాలు కావాలో అన్నింటికీ వేరువేరుగా దరఖాస్తులు పెట్టాల్సి ఉంటుందన్నారు. వివిధ రకాల సేవలకు చెందిన ఎన్ని ధ్రువపత్రాలు అవసరము ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలన్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్లో డి ఎల్డిఓ సుబ్బారావు ఆర్డీవోలు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement