Friday, May 17, 2024

Krishna: మణిపూర్ లో శాంతిస్థాపనకై కొవ్వొత్తులతో భారీ ర్యాలీ..

(విజయవాడ ప్రభ న్యూస్) : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో జరుగుతున్న వరుస సంఘటనలు భారతావనికే కళంకమని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కృష్ణా, గో అధ్యక్ష ఖండం సియస్ఐ బిషప్ టి. జార్జి కోర్నెలియస్ డిమాండ్ చేశారు. మణిపూర్ లో జరిగిన సంఘటనలను నిరసిస్తూ శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చర్చ్స్ ఆధ్వర్యంలో క్రైస్తవులు నగరంలో భారీ కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతదేశం విభిన్న మతాల, కులాల, జాతుల కలయిక అని, కాని మణిపూర్ సంఘటనలు చూస్తుంటే ఒక పథకం ప్రకారం మతోన్మాదం వెర్రితలలు వేస్తూ
మేతేయులను రెచ్చగొట్టి గిరిజన తెగలైన కుకీలు, నాగాలపై మారణహోమం సృష్టిస్తోందని
విమర్శించారు.ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శిబిరాలలో తలదాచుకున్నకుకీ, నాగాల ప్రజలను, ఇతర క్రైస్తవ ప్రజలకు తక్షణమే న్యాయంచేసి సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని డిమాండ్ చేశారు.

విజయవాడ కతోలిక పీఠం మోన్సిగ్నోర్ రెవ. ఫాదర్ మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ.. క్రైస్తవ మతం ఏ మతానికి కులానికి జాతులకు విరోధం కాదన్నారు. భారత ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ గిరిజన మహిళ అయ్యుండి మణిపూర్ క్రూర దాష్టకాన్ని ఖండించకపోవడం చాలా బాధకరమన్నారు. యూరప్ దేశాల పర్యటలో వున్న విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు ఒక సందేశం ద్వారా కొవ్వొత్తుల శాంతి ర్యాలీకి సంఘీభావం ప్రకటించారు. అంతకు ముందు బిషప్ హజరై హైస్కూల్ నుండి ప్రారంభమైన భారీ కొవ్వొత్తుల శాంతి ర్యాలీ వందలాది మంది క్రైస్తవులు రెడ్ సర్కిల్, సి.పి.ఆఫీసు రోడ్డు, సెయింట్ పాల్స్ బసితిక సియస్ఐ చర్చి మీదుగా బందర్ రోడ్డు గుండా స్కూల్ వరకు కొనసాగింది. అనంతరం మణిపూర్లో శాంతిని నెలకొల్పాలని హాజరైన క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement