Sunday, May 5, 2024

మీడియం రేంజ్ బడ్జెట్‌లో 5జీ స్మార్ట్ ఫోన్లు.. వివరాలివే !

ప్రతి సంవత్సరం ఇండియన్ మార్కెట్ లోకొ ఏదో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతూనే ఉంటుంది. సరికొత్త ఫీచర్లతో.. ప్రీమియం నుండి బడ్జెట్ రేంజ్ ధరల్లో స్మార్ట్ ఫోన్లను సంస్థలు విడుదల చేస్తుంటాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు మొదలుకొని.. ఐ ఫోన్ల వరకు మంచి మంచి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా 5జీ స్మార్ ఫోన్లు వస్తున్నాయి. అయితే ధర రూ.10వేల నుంచి మొదలుకొని బడ్జెట్ రేంజ్ ధరల్లో కూడా మంచి ఫోన్లు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా శాంసంగ్, రియల్ మీ, మోటారోలా, పోకో, టెక్నో కంపెనీలు పలు 5జీ స్మార్టో ఫోన్లను ఇటీవలే లాంచ్ చేశాయి.. మరి కొన్ని లాంచ్ చేస్తున్నాయి.. వాటిలో రూ.20 వేల లోపు ధరలో మంచి ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

గేలాక్సీ ఎం 34 5జీ..

శాంసంగ్ నుంచి వచ్చిన మీడియం రేంజ్ ఫోన్లలో గేలాక్సీ ఎం 34 5జీ బెస్ట్ అని చెప్పవచ్చు. దీనిలో ఫీచర్లు అలా ఉంటాయి మరి. 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే విత్ 120 హెడ్జ్ రీఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 స్క్రీన్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 13 విత్ వన్ యూఐ 5.1 ఆపరేటింగ్ సిస్టం వంటి ఫీచర్లున్నాయి. ఎం 34 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ. 18,999 గా ఉంది.

రియల్మీ నార్జో 60 5జీ..

- Advertisement -

స్టైల్ తో పాటు వ్యాల్యూ పరంగా ఈ ఫోన్ మంచి ధరలో లభిస్తోంది. డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. మార్స్ ఆరెంజ్ వేరియంట్ చాలా బాగుంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6020 ఎస్ఓసీ, 8 జీబీ ర్యామ్, 128 లేదా 256 స్టోరేజీ వెరియంట్లు ఉన్నాయి. 6.43 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే విత్ 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 16,999 గా ఉంది.

మోటొరోలా జీ 73 5జీ..

బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న మంచి స్మార్ట్ ఫోన్లలో ఇది కూడా ఒకటి. దేశంలోనే తొలిసారి మీడియా టెక్ డైమెన్సీ 930 ఎస్ఓసీతో వచ్చిన మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే కావచ్చు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డుతో స్టోరేజీని 1 టీబీ వరకు ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే విత్ 120 హెడ్జ్ రిఫ్రెష్ రేటు ఉంటుంది. వాటర్ రెసిస్టాన్స్ డిజైన్ ఉన్నప్పటికీ ఐపీ రేటింగ్ లేదు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 16,999 గా ఉంది.

పోకో ఎక్స్ 5 5జీ..

తక్కువ ధరలో ఎక్కువ స్టోరేజీ కలిగి ఉన్న ఫోన్ కావాలనుకునేవారు దీన్ని ప్రిఫర్ చేయవచ్చు. 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజీతో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ తో రూపొందించారు. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. రీఫ్రెష్ రేట్ 120 హెడ్జ్. గొరిల్లా గ్రాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ. 16,999.

టెక్నో కెమాన్ 20 ప్రో 5జీ..

ఈ ఫోన్ ఇటీవలే లాంఛ్ అయింది. వెనుకవైపు 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 32 మెగా పిక్సెల్. మీడియా టెక్ డైమెన్సిసీ 8050 చిప్ సెట్ తో రూపొందిచారు. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే విత్ 120 హెడ్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 19,699 గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement