Saturday, April 27, 2024

విజయవాడలో మొదటి డీలర్‌షిప్‌ ప్రారంభించిన బీవైడీ ఇండియా

వారెన్‌ బఫెట్‌ వెన్నంటి ఉన్న బీవైడీకి అనుబంధ సంస్థ బీవైడీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తమ మొట్టమొదటి డీలర్‌షిప్‌ షోరూమ్‌ను ప్యాసెంజర్‌ వాహనాల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ప్రారంభించింది. బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్‌ ప్యాసెంజర్‌ వెహికల్‌ బిజినెస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ గోపాలకృష్ణన్‌ మాట్లాడుతూ… విజయవాడతో ప్రారంభించి తాము త‌మ లక్ష్యిత వినియోగదారులకు మరింత సన్నిహితంగా వెళ్లనున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పీపీఎస్‌ మోటర్స్‌తో కలిసి త‌మ మొట్టమొదటి షోరూమ్‌ ప్రారంభించడం పట్ల చాలా ఆనందంగా ఉన్నామన్నారు.

పీపీఎస్‌ మోటర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ సంఘ్వీ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌ కోసం బీవైడీతో కలిసి పనిచేయడం పట్ల తాము చాలా ఆసక్తిగా ఉన్నామన్నారు. భారతదేశపు ఈవీ విప్లవంలో భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. బీవైడీ నుంచి వచ్చే సరసమైన ఉత్పత్తులతో పాటుగా వినియోగదారుల అవసరాలను లోతుగా అర్థం చేసుకోవడం వల్ల త‌మ వినియోగదారులకు అత్యుత్తమ యాజమాన్య అనుభవాలను అందించడానికి ప్రయత్నిస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement