Wednesday, May 8, 2024

Politics: రాష్ట్ర అధ్యక్షులను మారుస్తున్న బీజేపీ.. తెలంగాణలోనూ మార్పు ఉంటుందా?

బీజేపీ ముందస్తు వ్యూహాలను రచిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులను మార్పు చేస్తోంది. రాబోయే జనరల్​ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. తెలంగాణలోనూ అట్లాంటి మార్పు ఉంటుందా? అనే ప్రశ్న కూడా చాలామంది నుంచి వ్యక్తం అవుతోంది. ఎందుకంటే టీఆర్​ఎస్​ పార్టీ నుంచి బీజేపీలో చేరి.. హుజురాబాద్​ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి గెలిచిన ఈటల రాజేందర్​ పార్టీ అధిష్టానం దృష్టిలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. దీంతో ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్​కి ఈటలకి మధ్య కాస్త దూరం పెరిగిందని చాలామంది లీడర్ల ద్వారా తెలుస్తోంది. ఇక తెలంగాణలోనూ పార్టీ అధ్యక్షుడి మార్పు ఉంటుందన్న ఊహాగానాలు వినిపస్తున్నాయి. దీనికి ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ అధ్యక్షుల మార్పును కారణంగా చెబుతున్నారు చాలామంది లీడర్లు..

కాగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) త్రిపుర రాష్ట్రంలో పార్టీ చీఫ్‌గా రాజీబ్ భట్టాచార్జీని ఇవ్వాల (గురువారం) నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్​ సింగ్​ సంతకం చేసిన లేఖ ఒకటి రిలీజ్​ చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా త్రిపుర పార్టీ కొత్త చీఫ్‌గా రాజీబ్ భట్టాచార్జీని నియమించారని అందులో పేర్కొన్నారు.   గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి మాణిక్ సాహా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఇక.. ట్విటర్‌లో సీఎం మాణిక్ సాహా భట్టాచార్జీ చిత్రాలను షేర్ చేసి అభినందనలు తెలిపారు. అంతకుముందు రోజు, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రి భూపేంద్ర చౌదరిని బిజెపి ఉత్తరప్రదేశ్ యూనిట్ చీఫ్‌గా నియమించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement