Sunday, May 19, 2024

TS : త‌డిసిన ధాన్యం కొంటాం….అన్న‌దాత‌ల‌కు మంత్రి పొన్నం భ‌రోసా

అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా సివిల్ సప్లయ్స్‌ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో తాను మాట్లాడానని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

- Advertisement -

కరీంనగర్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్​ను గెలిపించాలి. ఫస్ట్, సెకండ్ ఫేజ్ ఓటింగ్​తోనే బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నది. అందుకే ప్రధాని మోదీ రెచ్చగొట్టేలా దిగజారి మాట్లాడుతున్నరు. తాళిబొట్టు అమ్మి నామినేషన్ వేసిన బండి సంజయ్​కి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినయ్? దేవుడి పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కునే సంజయ్.. కరీంనగర్​లోని ఆలయాల కోసం ఏం చేశాడు?’’అని పొన్నం నిలదీశారు. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగితే సంజయ్ ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలన్నారు. సంజయ్ లాంటి మూర్ఖుడు ప్రజాస్వామ్యానికి పనికి రాడని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement