Monday, May 6, 2024

Spl Story | కృష్ణా, కృష్ణా.. ఏపీ, తెలంగాణకు తప్పదా నీటి గోసా!

శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు తమ కనీస అవసరాల కోసం నీటిని తరలించుకోలేని పరిస్థితి దాపురించింది. జలాశయం నీటిమట్టం కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ఇరు రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీశైలం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, గత సోమవారం (23.09.2023) నాటికి 88 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలు మిగిలాయి. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు జల విద్యుదుత్పత్తి నిలిపేసినట్టు తెలుస్తోంది.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఏపీలోని కేసీకెనాల్​, ఎస్​ఆర్​బీసీ, తెలుగుగంగ కింద దాదాపు 6 లక్షల ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉంది. కనీస నీటి నిల్వలు లేకపోవడంతో కాల్వలకు నీరు అందడం లేదు. దీంతో చాలా చోట్ల వరి పంట ఎండిపోతోంది. నంద్యాల జిల్లాలో అయితే పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. అటు తుంగభద్రకు నీళ్లు లేకపోవడం, ఇటు కృష్ణా నుంచి చుక్కనీరు రాకపోవడంతో వరి రైతులు దిగాలుపడుతున్నారు. వేసిన వరి పంట ఎండిపోతోంది.

ఆరుతడి పంటలే సాగుచేయాలి..

శ్రీశైలం జలాశయానికి ఇప్పుడప్పుడే వరదలు వచ్చే అవకాశాలు లేకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలని సూచిస్తున్నారు. అది కూడా నెలకు ఒకటి రెండు తడులు మాత్రమే ఉండేలా చూసుకోవాలని సలహాలిస్తున్నారు. వరి పంట వేస్తే సాగునీరు అందించలేమని ఖరాఖండిగా తేల్చేస్తున్నారు.

- Advertisement -

ఎగువన వానల్లేవు.. కృష్ణా నదికి వరదల్లేవు..

ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు లేకపోవడంతో కృష్ణా నదికి వరదలు రాలేదు. ఎగువ నుంచి వచ్చే భారీ వరదలతోనే కృష్ణా, తుంగభద్ర, బీమా నదులకు నీరు పారుతుంది. దీంతో ఏపీ, తెలంగాణ పరిధిలోని జూరాల, శ్రీశైలం, పులిచింతల, నాగార్జున సాగర్​ వంటి ప్రాజెక్టులకు నీరు చేరుతుంది. కానీ, ఈ ఏడాది పెద్దగా వర్షాలు లేకపోవడంతో ఈ జలాశయాలన్నీ నీటి నిల్వలు లేక బోసిపోతున్నాయి. అయితే.. ఇప్పుడప్పుడే కృష్ణా నదికి వరదలు వచ్చే అవకాశాలు లేవని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్​ 19 వరకు వర్షాలు వచ్చే చాన్స్​ లేదని, అందుకని సాగు, తాగు నీటికి ప్రత్యామ్నాయం ఏంటనే ఆలోచనలో అధికారులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement