Wednesday, October 9, 2024

BRS Fire – గ‌వ‌ర్న‌ర్ పై మంత్రులు హ‌రీష్ రావు, ప్ర‌శాంత్ రెడ్డి ఆగ్ర‌హం …రాజీనామాకు డిమాండ్ ..

హైద‌రాబాద్ : కెసిఆర్ మంత్రి మండ‌లి గ‌వ‌ర్న‌ర్ కోటా అభ్య‌ర్ధులుగా ప్ర‌తిపాదించిన దాసోజు శ్ర‌వ‌ణ్‌, కుర్రా స‌త్య‌నారాయ‌ణ లను గ‌వ‌ర్న‌ర్ తిర‌స్క‌రించ‌డంపై మంత్రులు హారీష్ రావు, ప్ర‌శాంత రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తీరుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు త‌ప్పు పెట్టారు. త‌మిళిసై గ‌వ‌ర్న‌ర్‌లా కాకుండా బీజేపీ ప్ర‌తినిధిలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మంత్రి మండిప‌డ్డారు. కేబినెట్ ఆమోదించిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థిత్వాల‌ను గ‌వ‌ర్న‌ర్ ఎలా తిరస్క‌రిస్తారు? అని ప్ర‌శ్నించారు. త‌మిళిసై ఆది నుంచి తెలంగాణ ప్ర‌గ‌తికి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్నార‌ని అంటూ ఇప్ప‌టికే ప‌లు కీల‌క బిల్లులు గ‌వ‌ర్న‌ర్ పెండింగ్‌లో పెట్టార‌ని గుర్తు చేశారు. . గ‌వ‌ర్న‌ర్ ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్నారు. సుబ్ర‌హ్మ‌ణ్య స్వామిని రాజ్య‌స‌భ‌కు ఎలా నామినేట్ చేశారో గ‌వ‌ర్న‌ర్ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ఇక రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి గ‌వ‌ర్న‌ర్ చ‌ర్య‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.. క్యాబినేట్ నిర్ణ‌యాన్ని తొసిపుచ్చిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై త‌క్ష‌ణం త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. . త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షురాలిగా ఉండి త‌మిళిసై గ‌వ‌ర్న‌ర్‌గా నామినేట్ అయ్యార‌ని విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. గ‌వ‌ర్న‌ర్‌గా త‌మిళిసైని నియ‌మించ‌డం కూడా స‌ర్కారియా క‌మిష‌న్‌కు విరుద్ధ‌మ‌న్నారు. త‌మిళిసై గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగే నైతిక హ‌క్కు లేద‌ని, . త‌క్ష‌ణ‌మే గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి నుంచి వైదొల‌గాల‌ని డిమాండ్ చేశారు. కేబినెట్ ప్ర‌తిపాదించిన‌ దాసోజు శ్ర‌వ‌ణ్‌, కుర్రా స‌త్యనారాయ‌ణ సామాజిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న‌వారే అని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement