Monday, May 6, 2024

AP: కొండలరావు బడిపంతులా ?… ప్రజా సేవకుడా ?.. ఎమ్మెల్సీ భూమిరెడ్డి

పులివెందుల, ఫిబ్రవరి 4 (ప్రభ న్యూస్) : కౌన్సిలర్ కొండలరావు బడిపంతులా ? లేక ప్రజాసేవకుడా ? అని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్ర‌శ్నించారు. సోమవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…. పులివెందుల మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ గా కొంగనపల్లి కొండలరావు విధులు నిర్వహిస్తున్నారు. కొండలరావు టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి 1998 డి యస్ సి అర్హులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో ఇతను ఉపాధ్యాయ పోస్టుకు అర్హత సాధించి ఉద్యోగం పొందడం జరిగిందన్నారు. ఇతను లింగాల మండలంలో పుట్టినంతలా మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడన్నారు. అక్కడ ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ పిల్లలకు న్యాయం చేస్తున్నాడా, పులివెందుల 23వ వార్డుల కౌన్సిలర్ గా ఉండి ఆ వార్డు ప్రజలకు ఏం న్యాయం చేస్తాడో అర్థం కాలేదన్నారు.

ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదన్న విషయం అతనికి తెలియదా ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటే ప్రజా ప్రతినిధిగా అనర్హుడన్నారు. కొండలరావు అధికార అండదండలతో ఒకే సమయంలో రెండు విధులను నిర్వహిస్తున్నారన్నారు. ఇటు కౌన్సిలర్ గా ప్రభుత్వ సొమ్ము తీసుకుంటూ, అటు టీచర్ గా కూడా ప్రభుత్వ సొమ్ము తీసుకుంటున్నాడన్నారు. కొండలరావు కౌన్సిలర్ గా ఉంటూ టీచర్ గా పనిచేస్తున్న విషయం మున్సిపల్ అధికారులు కూడా స్పష్టంగా తెలుసన్నారు.

అయినప్పటికీ వారు చర్యలు తీసుకోకపోగా కనీసం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. జిల్లాలో ఇంత బరితెగింపుగా వ్యవహరిస్తూ విధుల్లో నిర్లక్ష్యం అవినీతికి పాల్పడిన విద్యాశాఖ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అలాగే తప్పుడు డిక్కర్లేషన్ ఇచ్చి ప్రజాప్రతినిధిగా రాజీనామా చేయకుండా టీచర్ గా కొనసాగుతున్న కొండలరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement