Sunday, May 19, 2024

Jail dairy day 4 – నేడు చంద్ర బాబు తో పవన్, బాలకృష్ణ, నారా లోకేశ్ ములాఖత్

రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కలవనున్నారు. ఈ మేరకు జనసేన ప్రకటనను విడుదల చేసింది. పవన్ గురువారం రాజమండ్రి వెళ్తున్నారని, అక్కడి కేంద్రకారాగారంలో ఉన్న చంద్రబాబును కలుస్తారని, ములాఖత్ సమయంలో ఈ భేటీ ఉంటుందని పేర్కొంది. ముందుగా పవన్ రాజమండ్రి చేరుకొని, తొలుత చంద్రబాబు కుటుంబ సభ్యులతో భేటీ కానున్నారు. భువనేశ్వరిని పరామర్శిస్తారు..

ఆ తర్వాత మధ్యాహ్నం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి పవన్ టీడీపీ అధినేతను కలవనున్నారు. ములాఖత్ ఖరారైనట్లు టీడీపీ వర్గాలు కూడా వెల్లడించాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement