Monday, May 6, 2024

MP Rammohan:హామీలు అమ‌లు చేయ‌డు…అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డు…జ‌గ‌న్ పై ఎంపి రామ్మోహ‌న్ విసుర్లు

సంత‌బొమ్మాళి – సీఎం జగన్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి గెలిచారు.. కానీ, గెలిచాక ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయలేకపోయారని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.వైసీపీ ఇచ్చిన 730 హామీల్లో 621 హామీలు అమలు చేయలేదు.. రాష్ట్రం అతలాకుతలంగా మారింది అని ఆయన చెప్పారు.

నేడు సంత‌బొమ్మాళిలో జ‌రిగిన టిడిపి జైత్ర‌యాత్ర ర్యాలీలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ, రాష్ట్రంలో ఒక్క కుటుంబం కూడా సంతోషంగా లేద‌ని, .. 99.5 శాతం హామీలు అమలు చేసామని కల్లబోల్లి కబుర్లు చెబుతున్నార‌న్నారు . . ప్రెస్ మీట్ కూడా పెట్ట లేని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అంటూ ఫైర్ అయ్యారు.

రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి.. ఒక్క నోటిఫికేషన్ సరిగ్గా చేయలేదు అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. జాబ్ క్యాలేండరు కూడా లేద‌ని, ప్రత్యేక హోదాపై ఒక్క వైసీపీ ఎంపీ కూడా నోరు మెదపడంలేద‌ని పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై పోరాటం చేయలేని దద్దమ్మలు వైసీపీ నాయకుల‌ని, .. రైల్వేజోన్ కి మేం పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింద‌ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో స్పష్టం చేసింద‌ని వెల్ల‌డించారు.. . దోచుకుందాం దాచుకుందాం అనే ధోరణిలోనే వైసీపీ వాళ్లు ఉన్నారు అని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

విశాఖ మొత్తం వైసిపి నేత‌ల భూక‌బ్జాలే…

- Advertisement -

విశాఖపట్నం మొత్తం భూకబ్జాలు చేస్తున్నారు అని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది.. ఇసుక దోరక్క కార్మికులు ఉపాది లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. మద్యపాన నిషేధం అంటూ అబద్దపు ప్రచారం చేసారు.. మద్యం రేట్లు పెరుగుతున్నాయి తప్ప.. మద్యం నిషేధం లేదు.. పేద కుటుంబాల పైనా పన్నుల భారం వేస్తున్నారు.. 4 ఏళ్లలో శ్రీకాకుళం కలెక్టరేట్ కూడా కట్టలేక పోయారు.. ఆడుదాం ఆంధ్రా అంటే మీ అందరితో ఆడుతా అంటున్నాడు జగన్.. ఆర్దిక ఉగ్రవాది జగన్ తండ్రి అధికారంలో ఉండగానే దోచుకున్నాడు.. ఇప్పుడు వదిలేస్తాడా అని ఆయన అడిగారు. మంత్రి సిదిరి అప్పల రాజు సవాల్ ని స్వీకరిస్తున్నాం.. హామీల అమలు జిల్లా అభివృద్ధిపై చర్చకు మేం సిద్దంగా ఉన్నాం.. యూట్యూబ్ లలో లైక్ ల కోసం మంత్రి సీదిరి కాంట్రవర్శి కామెంట్స్ చేస్తున్నారు అని ఎంపీ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement