Thursday, December 7, 2023

FLASH: నంద్యాలలో హోంగార్డు దారుణ హత్య

నంద్యాల పట్టణంలో ఓ హోం గార్డ్ పై దాడిచేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ వద్ద కొంత మంది యువకులు మద్యం సేవిస్తున్నారు. ఇది గమనించిన హోంగార్డు గుండంపాడు శేఖర్ అక్కడ మద్యం తాగొద్దన్నందుకు హోంగార్డు పై యువకులు దాడికి పాల్పడ్డారు. దీంతో అతను తీవ్ర గాయాలు కావడంతో అక్కడికి అక్కేడే మృతి చెందాడు. ఘటన అనంతరం నిందితులు పరారయ్యారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థిలికి చేరుకుని.. హోంగార్డు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. హోంగార్డుపై దాడి చేసి అతని మృతికి కారణమైన యువకులకోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement