Friday, April 26, 2024

గులాబ్ బీభత్సం.. విజయనగరంలో పంటలకు తీవ్ర నష్టం

గులాబ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా కోస్తా ఆంధ్ర జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. విజయనగరం జిల్లాలో గులాబ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గజపతినగరంలో 61 మంది, తెర్లాము మండలం జి.గదబవలస నుంచి 18 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరికి ఆహారం, త్రాగునీరు సరఫరా చేస్తున్నారు.

తుఫాన్ కారణంగా సుమారు 13,122 హెక్టార్లలో పంటలు, 291 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిళ్లినట్లు ప్రాధమికంగా అంచనా వేశారు. వర్షాల కారణంగా 9 పశువులు మృతి చెందాయి. పలు రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో జిల్లా యంత్రాంగం పునరుద్ధరణ పనులను హుటాహుటిన చేపట్టారు.

నేల కూలిన చెట్లను, రాత్రికి రాత్రే తొలగించి, రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్లు తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement