Friday, April 19, 2024

IPl: ముంబైని చిత్తు చేసిన బెంగళూరు

ఐపీఎల్ మ్యాచ్‌లు ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతున్నాయి. నిన్న జరిగిన రెండు మ్యాచులు అభిమానులను ఉర్రూతలూగించాయి. నిన్న తొలుత కేకేఆర్-సీఎస్‌కే మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి చెన్నై అనూహ్య విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై 166 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించలేక ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టతరం చేసుకుంది.

ముంబై ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 54 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు… 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. కోహ్లీ, మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై 18 ఓవర్లకు ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ హ్యాట్రిక్‌తోపాటు ఏకంగా 4 వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాశించాడు. హర్షల్‌కు తోడు స్పిన్నర్ చాహల్ 4 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి 2.75 ఎకానమీతో 3 వికెట్లు తీశాడు.

ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 1 వికెట్ తీశారు. ఛేజింగ్‌లో ముంబైకి మంచి ఓపెనింగ్‌ ఇచ్చారు రోహిత్ శర్మ, డీకాక్‌. రోహిత్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 43 పరుగులు చేయగా… క్వింటన్ డీకాక్ 23 బంతుల్లో 4 ఫోర్లు బాది 24 పరుగుల భాగస్వామ్యం అందించాడు.అయితే ఓపెనింగ్ బాగున్నా వీరిద్దరూ అవుటైన తర్వాత ముంబై చతికిలపడింది. ఒక్క ఆటగాడు కూడా రెండంకెల స్కోరు చేయలేదు. దీంతో 18.1 ఓవర్లలో కేవలం 111 పరుగులకే ముంబై ఆలౌటైంది. దీంతో ఏకంగా 54 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం కైవసం చేసుకుంది.

ఇది కూడా చదవండి: జేఎన్టీయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement