Saturday, April 27, 2024

ఎన్.జి.రంగా జయంతి వేడుకలకు హర్యానా గవర్నర్ రాక

రైతు సంక్షేమానికి వారి అభివృద్ధికి నిరంతరం శ్రమించిన సీనియర్ పార్లమెంటేరియన్ ఆచార్య ఎన్.జి.రంగా జయంతి వేడుకలను వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ గాజుల రామచంద్రరావు తెలిపారు. శనివారం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి నమ్మిన సిద్ధాంతంతో ఎన్నో సేవలందించిన ఆయన పేరును వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విద్యాలయంగా నామకరణం చేశారన్నారు.అటువంటి గొప్ప వ్యక్తి జయంతి వేడుకలను కళాశాలలో ఈ నెల 7వ తేదీన నిర్వహిస్తున్నామన్నారు.ఈ జయంతి వేడుకలకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, పొన్నూరు శాసనసభ్యులు కీలరి వెంకట రోశయ్య, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ హాజరుకానున్నారని వివరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ బాబు ప్రొఫెసర్ జయాభినందన పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement