Tuesday, May 7, 2024

న‌రేంద్ర అరెస్ట్ దుర్మార్గమైన చర్యే – యరపతినేని

పిడుగురాళ్ల – టిడిపి మాజీ శాసనసభ్యుడు, సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రని అరెస్టు చెయ్యడం దుర్మార్గ‌మ‌ని వ్యాఖ్యానించారు టిడిపి మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌త‌నేని శ్రీనివాస‌రావు… మాజీ శాసనసభ్యుల్ని, మాజీ మంత్రుల్ని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులపై ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచెయ్యాలని వైసిపి నేత‌లు చూస్తున్నారని ఆయ‌న మండి ప‌డ్డారు. జైలుకు పోయిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తెలుగుదేశం వారిని కూడా జైలులో ఉంచాల‌నే ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు.. ఎంత‌మందిని ఆరెస్ట్ చేసినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయ‌లేర‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement