Tuesday, September 28, 2021

బ్లాక్ లో రెమెడిసివిర్ – అరుగురు అరెస్ట్…

తెనాలిలో రెమెడిసివర్ మందులను అక్రమంగా విక్రయిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న వ్యక్తి ద్వారా ఇంజక్షన్లు తీసుకుని బ్లాక్ లో అత్య‌ధిక ద‌ర‌ల‌కు వాటిని ఈ ముఠా అమ్ముతున్న‌ది . అలాగే హైదరాబాద్ నుంచి ఇంజక్షన్లు తెప్పించి అధిక ధరలకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఇంజక్షన్లు అమ్ముతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 6 రెమెడిసివర్ ఇంజక్షన్లు, రూ.2.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News