Saturday, May 4, 2024

అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్ …సేవే అంతిమం

కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్న ‘అమ్మ’ ట్రస్ట్‌
మృతుల బంధువులే వద్దనుకుంటున్న వేళ మానవతా సేవలు
ప్రసన్నగిరి బాబా వెంట యువతరం
దాతృత్వ. అన్నదాన కార్యక్రమాలలోనూ అమ్మ ముద్ర

గుంటూరు: అమ్మ… ఈ సృష్టిలో ఇంతకు మించిన మధుర భావన మరొకటి ఉండదు. చరాచర జగత్తులో అనంతకోటి జీవరాశులకు ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా ప్రేమను పంచేది అమ్మ ఒక్కటే అంతే అతిశయోక్తి కాదు. అమ్మ ప్రేమ అనుభవేద్యమే కానీ ప్రచారానికి నోచుకునేది కాదు. ఇలా అమ్మ ను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమ్మ ప్రేమకు సజీవ తార్కాణంగా, కరోనా విపత్కర పరిస్థితులలో సమాజానికి ప్రేమను పంచు తూ అందరికీ ఆదర్శంగా నిలి చింది గుంటూరు లోని అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌. దాని వ్యవస్థాపకులు స్వామి జ్ఞాన ప్రసన్న గిరి బాబా కరోనా సమయంలో చేస్తున్న సేవలు నిరుప మా నమైనవి. సేవాకార్యక్రమాలు, దాతృత్వ కార్యక్రమాలు విశేష ప్రచా రం లభిస్తున్న ప్రస్తుత తరుణంలో అసమాన సేవలకు ఇసుమం తైనా ప్రచారం చేసుకోకపోవటం జ్ఞాన ప్రసన్న బాబా ప్రత్యేకత.
వేలాది మృతదేహాలకు అంతిమ సంస్కారం
సాధారణంగా స్వామీజీలు అనగానే ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన భావం చోటు-చేసుకుంటు-ంది. అయితే జ్ఞాన
ప్రసన్న బాబా సేవలు స్వయంగా చవిచూసిన వారు మాత్రం ఆయనకు చేతులెత్తి మొక్కకుండ వుండలేరు. అమ్మ ట్రస్ట్‌ నెలకొల్పిన నాటి నుంచి గత రెండు దశాబ్దాలుగా నిరుపమా నమైన సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 30 వేల మృతదేహాలకు జ్ఞాన ప్రసన్న స్వయంగా అంతిమ సంస్కారా లు నిర్వహించటం ఒక రికార్డే. గత ఏడా ది కాలంగా కోవిడ్‌ విపత్కర పరిస్థితుల లోనూ ప్రతి రోజూ 50 నుంచి 60 వరకు మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. వాటిలో అధిక భాగం కరోనా పాజిటివ్‌ కారణంగా మరణించిన వారి వుండటం విశేషం. కరోనా మహమ్మారి మానవ సంబంధాలను సైతం కాటేసింది. ఈ స్థితిలో ఎవరైనా మర ణిస్తే వారి కుటు-ంబీకులు, రక్త సంబంధీకులు సైతం దగ్గరకు రాని పరిస్తితి. అటు-వంటి స్థితిలో జ్ఞాన ప్రసన్న బాబా స్వ యంగా ఆ మృతదేహాన్ని చేతులతో మోసుకెళ్ళి అంబులెన్స్‌ ద్వారా స్మశాన వాటికకు తీసుకెళ్ళి అన్నీ తానే అయి అంతిమ సంస్కారాలు నిర్వ హిస్తున్నారు. కొన్ని చోట్ల సంప్రదాయాల ప్రకారం మరణించిన వారి కుటు-ంబ సభ్యులను వారు అద్దెకు వుండే ఇంటి యజమానులు లోనికి వచ్చేందుకు నిరాకరిస్తే, అటు-వంటి వారందరికీ తన ఆశ్రమం లోనే ఆసరా కల్పిస్తూ తన ఔదార్యాన్ని చాటు-కుంటు-న్నారు.
ఆపద్బాంధవుడు
పలు సందర్భాలలో అనాధ, గుర్తు తెలియని మృతదేహా లను ఖననం చేయటం పోలీసులకు పెద్ద సమస్యగా పరిణమిస్తుం ది. ఒక్కో సారి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో భయానకంగా వుంటాయి.వెంటనే ఆ విషయాన్ని అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ కు చెరవేసిన సందర్భాలు ఎన్నో వున్నాయి. చూడటానికి భయంకరం గా వుండి దుర్వాసన వస్తూ కుళ్ళిన స్థితిలో వున్న మృతదేహాలను జ్ఞాన ప్రసన్న బాబా రెండు చేతులతో మోసుకెళ్లి అంబులెన్స్‌లో చేర్చి వాటికి అంతిమ సంస్కా రాలు నిర్వహించేవారు. ఈ విధంగా లెక్కకు మిక్కిలిగా మృతదేహాలకు వారివారి మతాచారాలు ప్రకారం అంతిమ సంస్కారం నిర్వహించటం ఎంతైనా అభినందనీయం. కుల, మత వివక్ష లేకుండా జ్ఞాన ప్రసన్న బాబా స్వయంగా వారి భౌతిక కాయాలను తన స్వహస్తాలతో తీసుకెళ్లటం సాధారణ విషయం కాదు.
వైజ్ఞానిక అద్భుతమే
కరోనా వచ్చిన వారి దగ్గరకు వెళ్లేందుకు అయినవాళ్లే ముందువెనక ఆలోచి స్తుంటారు. అదే కరోనా తో మరణిస్తే ఆ మృతదేహాన్ని తాకేందుకు సైతం ఎవరూ ముందుకు రారు. కానీ జ్ఞాన ప్రసన్న బాబా ముఖానికి, చేతులకు కనీసం ఏ విధమైన ఆచ్చాదన లేకుండా చేతులతో తాకుతూ శుభ్రపర చడం, అంతిమ సంస్కారాలు నిర్వహించటం చేస్తుంటారు. జ్ఞాన ప్రసన్న బాబా సేవల్లో పాలు పంచుకునేందుకు ఎంతో మంది ఉన్నత విద్యావంతులైన యువకులు వచ్చి పాలు పంచుకుంటు-న్నారు. జ్ఞాన ప్రసన్న బాబా తో పాటు- వారంతా అనునిత్యం కరోనా మృతదేహాలు, కరోనా రోగుల మధ్యనే రోజంతా కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే జ్ఞాన ప్రసన్న బాబా తో పాటు- ఆయన వెంట వుండే వారికి ఇప్పటి వరకు 5 సార్లు కరోనా పరీక్షలు ని ర్వహించారు. వారిలో ఏ ఒక్కరికీ కరోనా పాజిటివ్‌ లక్షణాలు లేకపోవటం విస్మయా నికి గురిచేస్తోంది. ఇది వైజ్ఞానిక అద్భుతమంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement