Sunday, April 14, 2024

విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో శ‌వాల గుట్ట‌లు

విజయవాడ ప్రభుత్వ సర్వజనాసుపత్రి మార్చురీ శవాల కుప్పగా మారింది. అందరూ ఉన్న ఎవరూ లేనట్లుగా అంతిమ సంస్కారా నికి కూడా నోచుకోకుండా శవాలు పడి ఉన్నాయి. ఒకవైపు కరోనా మరణాలు, మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి శవాలతో నిండిపోయింది. సామర్ధ్యానికి మించి శవాలు ఉండటంతో జీజీహెచ్‌ సిబ్బంది చేతులెత్తేశారు. మార్చురీలో 50 మృత దేహాలను మాత్రమే ఉంచే సామర్ధ్యం ఉంది. అయితే దీనికి భిన్నంగా 81 శవాలను జీజీహెచ్‌ సిబ్బంది మార్చురీలో పడేశారు. గడిచిన రెండు మూడు రోజులుగా సంభవించిన కరోనా మరణా లతో పాటు చికిత్స పొందుతూ మృతి చెందిన వారి శవాలు కూడా అక్కడే పడి ఉన్నాయి. ప్రస్తుతం కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న నేపథ్యంలో శవాలను తీసుకువెళ్లేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. బంధువులు ముందుకు రానట్లయితే కార్పొరేషన్‌ సిబ్బందికి అప్ప గించుతామని జీజీహెచ్‌ అధికారులు హెచ్చరించినప్ప టికీ ఫలితం లేదు. చాలా మంది మృత దేహాలను తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందు కు రాని పరిస్థితి ఉంది. కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తలు అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ముందుకు వచ్చినప్పటికీ నిబంధనలు కొంత మేరకు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో శవాలు మార్చరీలో పేరుకుపోయాయి.
స్పందించిన ఉప ముఖ్యమంత్రి
విజయవాడ జీజీహెచ్‌లో మృత దేహాలు పేరుకుపోయిన దారుణ ఘటనపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తీవ్రంగా స్పం దించారు. శనివారం మీడియాలో వచ్చిన కథనాలను చూసిన ఆయన జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ శివ శంకర్‌తో పాటు, ఆర్‌ఎంవో హనుమంతరావుకు ఫోన్‌ చేసి క్లాస్‌ తీసుకున్నారు. కరోనాతో చనిపోయిన వారు మృత దేహాలను బంధువుల అంగీకారంతో వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు. ఎవరూ ముందుకు రాని పక్షంలో మృత దేహాలను ఖననం చేసే ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రెండో దశ కరోనా విస్తరణలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మరణాలను నివారించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ దురదృష్టశావత్తు అనేక మంది మృత్యువు పాలవడం విచారణకరమన్నారు. తక్షణమే ఆస్పత్రిలో మరో రెండు ఫీజర్‌లను ఏర్పాటు చేయాలని, అలాగే అంత్యక్రియలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆళ్ల నాని ఆదేశించారు. రెండ్రోజుల్లో 135 మంది చనిపోయారని ఇప్పటికే 80 మృత దేహాలను వారి వారి కుటుం బ సభ్యులకు అప్పగించినట్లు సూపరీటెం డెంట్‌ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. మృత దేహాలను బంధు వులకు అప్పగించడంలో జాప్యం ఉండకూడదని, అధికార యంత్రాం గం సమన్వయంతో వ్యవహరించాలని ఆళ్ల నాని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement