Tuesday, April 30, 2024

మ‌న మామిడి ఎంతో రుచి….

రాష్ట్రానికి తీపికబురు..
మధుర ఫలాలకు ప్రపంచం ఫిదా
సరఫరా చేయాలంటూ ఆర్డర్లు
5వేల టన్నుల ఎగుమతికి ఒప్పందాలు
ఉద్యానవనశాఖ, అపెడా సౌజన్యంతో సరఫరా
ఎగుమతుల ప్రధాన
క్లస్టర్‌గా ఉలవపాడు

అమరావతి, : మధురఫలాలైన మామిడి పండ్ల సీజన్‌ ప్రారంభంతోనే మన మామిడి రైతులకు తీపికబురు అందుతోంది. మన రాష్ట్రంలో పండిన మామిడి పండ్లకు ఇటు దేశీయంగాను, అటు విదేశాలనుంచి కూడా ఆర్డర్లు వెల్లవలా వస్తుండటం విశేషం. అమెరికా, సింగపూర్‌, లండన్‌ తదితర దేశాల నుంచి ఇప్పటికే ఎగుమతి ఆర్డర్డు రావటం, రైతులు-ఎగుమతిదారుల మధ్య ఒప్పందాలు కుదుర్చటంలో రాష్ట్ర ఉద్యాన వనశాఖతో పాటు- అగ్రికల్చరల్‌ అండ్‌ ప్రొసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ- (అపెడా) కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతర్జాతీయ ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా అత్యుత్తమైన ప్యాకింగ్‌లో నాణ్యమైన పండ్లను ఎగుమతి చేయటం..పండ్ల తోటల పెంపకం, ప్యాకింగ్‌లో రైతులకు అవగాహన కల్పించే విషయంలో నేషనల్‌ హార్డికల్చర్‌ బోర్డు సహకారం అందిస్తోం ది. ఇటీవల అపెడా ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిం చిన ఎక్స్‌పోర్టర్స్‌ మీట్‌లో 5 వేల మెట్రిక్‌ టన్నుల మామిడి ఎగుమతులకు ఆర్డర్లు వచ్చాయి. ఆ మేరకు మామిడి ఎగుమతులు కూడా ప్రారంభమయ్యాయి.
నోరూరిస్తున్న ఉలవపాడు మామిడి
ప్రత్యేకించి ఉలవపాడు మామిడికి విదేశాల్లో బాగా డిమాండ్‌ ఏర్పడింది. విదేశీ ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా ఎంపిక చేసిన ఉలవపాడు మామిడిని ఎగుమతి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ఎగుమతులే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో సుమారు 6 వేల హెక్టార్లలో ఉలవపాడు మామిడి తోటలను అభివృద్ది చేయగా ఈ ఏడాది దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో ఉండటంతో ఎగుమతి మార్కెట్ కూడా బాగా పెరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ మేరకు విదేశీ ఎగుమతులే లక్ష్యంగా ఉలవపాడును రాష్ట్ర ఉద్యానవనశాఖ ప్రధాన క్లస్టర్‌గా ఎంపిక చేసింది. నాణ్యమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేసి, పెద్దఎత్తున వాటిని ఎగుమతి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. దీని కోసం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 55 మంది అంతర్జాతీయ ఎగుమతిదారులు, ట్రేడర్లు, కార్గో డీలర్లతో రాష్ట్ర ఉద్యాన వనశాఖ సంప్రదింపులు చేస్తోంది. ఈ ఏడాది ఒక హెక్టారుకు 15 టన్నుల దిగుబడి రావచ్చని అంచ నా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల మామిడి పండ్లు కలిపి సుమారు 60 లక్షల టన్నుల దిగుబడి రావచ్చని భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు- విదేశాలకు ఎగుమతులను భారీగా పెంచటం ద్వారా రైతులు లాభం పొందేలా ఉద్యానవనశాఖ ప్రణాళిక రచిస్తోంది. ఉలవపాడుతో పాటు- ప్రసిద్ది చెందిన విజయ నగరం, గోపాలపురం, నూజివీడు, చిత్తూరు ప్రాంతాల్లో పండిన ఎంపిక చేసిన తోటల్లోని పండ్లను విదేశాలకు ఎగుమతి చేసే ప్రక్రియ ప్రారంభమైంది. పోస్ట్‌ హార్వెస్టింగ్‌ -టె-క్నాలజీ, మార్కెటింగ్‌ సౌకర్యాలు, ప్యాకింగ్‌ నైపుణ్యత, గిడ్డంగులు, ప్రయోగశాల తదితర సౌకర్యాలను ఉద్యానవన శాఖ ఏర్పాటు- చేసి రైతులను ప్రోత్సహిస్తోంది.
ఉత్తరాదికి బంగినపల్లి
మరో వైపు దేశీయంగా ఏపీ నుంచి వివిధ రాష్ట్రాలకు మామిడి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, గుజరాత్‌తో పాటు- ఉత్తరాది రాష్ట్రాలకు కృష్ణా జిల్లాలోని నున్న మామిడి మార్కెట్‌ నుంచి ఎగుమతులు ప్రారంభ మయ్యాయి. ఇప్పటివరకు 100 టన్నులకు పైగా బంగినపల్లి మామిడి పండ్లను ఎగుమతి చేసినట్టు వ్యాపారులు చెబుతున్నారు. రెడ్డిగూడెం ప్రాంతంలో పండిన పండ్లను ప్రస్తుతం ఎగుమతి చేస్తుండగా నూజివీడు, నున్నతో పాటు ఇతర ప్రాంతాల్లో పండిన బంగినపల్లి కోత దశలో ఉన్నా యనీ, అవి కూడా వచ్చాక ఎగుమతి మార్కెట్‌ ఊపందు కుంటు-ందని చెబుతున్నారు. ప్రస్తుతం కాయ బరువును బట్టి టన్ను రూ 30 వేల నుంచి రూ 50 వేలు పలుకుతోంది. మరో వైపు రైల్లే కోడూరు నుంచి పులిహోర, రుమాణి రకం మామిడిపండ్ల ఎగుమతులు కూడా ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్‌, ముంబయి, సూరత్‌, రాజస్థాన్‌, బిల్వాడ తదితర ప్రాంతాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు. రుమాణి మామిడి పండ్ల ధర కిలో 30 నుంచి 35 రూపాయలు పలుకుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement