Sunday, April 28, 2024

మధురమైన తేనెతో తీయటి లాభాలు..

కర్లపాలెం – మానవుడికి మేలు చేసే కీటకాలలో అతి ముఖ్యమైనవి తేనెటీగలు. మధురమైన తేనెను మాత్రమే కాదు. సమతుల ఆహారాన్ని అందించే తేనెటీగ ల ద్వారా మంచి ఆదాయాన్ని కూడా గడించవచ్చు. బాపట్ల పొన్నూరు ప్రాంతాల్లో తేనెటీగల పరిశ్రమలు విరాజిల్లుతున్నాయి. నేడు ప్రపంచ తేనెటీగల దినోత్సవ సందర్భంగా అందిస్తున్న ప్రత్యేకం…. తేనెటీగల పెంపకం మంచి ఆదాయాన్ని సమకూర్చే పరిశ్రమలుగా విరాజిల్లుతున్నాయి. మానవుడికి మేలు చేసే కీటకాల లో అతి ముఖ్యమైనవి తేనెటీగలు. తేనెటీగల పరిశ్రమలపై అనేక మంది రైతులు దృష్టి సారిస్తున్నారు. తేనెటీగల్లో నాలుగు జాతులు ఉన్నాయి. ఇందులో కొండ తేనెటీగలు, విసనకర్ర తేనెటీగలు, పుట్ట తేనెటీగలు, ఐరోపా తేనెటీగలు ప్రధానమైనవి. పువ్వుల పరాగసంపర్కం లో తేనెటీగలు ఎంతగానో దోహద పడుతున్నాయి. పరాగసంపర్కం ఫలితంగా పుష్పం ఫలం గా మారి దానిలో విత్తనాలు ఉద్భవిస్తాయి. తేనెటీగలు లేకపోతే మొక్కలు ఉండవు. జంతువులు ఉండవు. మానవ మనుగడే ప్రశ్నార్థకం గా ఉంటుంది. ఫలదీకరణ లో తేనెటీగల పాత్ర అద్వితీయమైనది. ప్రపంచవ్యాప్తంగా 87 రకాల తేనెటీగల జాతులు ఉన్నాయి. అందులో నాలుగు రకాల జాతులు ప్రధానమైన గా పేర్కొనవచ్చు .ఆహార పంటల దిగుబడిని పెంచటంలో తేనెటీగల వంటి కీటకాలు ఎంతగానో దోహద పడుతున్నాయి .. ఆహార భద్రతను సాధించటంలో తేనెటీగలు ఉపయోగపడుతున్నాయి. తేనెటీగల ప్రాముఖ్యతను తెలియక అనేక మంది వీటిని విస్మరిస్తున్నారు . తేనెటీగల వల్ల ఉపయోగాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తేనెటీగలు లేకపోతే మానవుడి మనుగడప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. తేనెటీగ ల పై ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అనేక ప్రాంతాల్లో తేనెటీగల పరిశ్రమ మీద రైతులు దృష్టి సారిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా విజయరాయి లోని తేనెటీగల పరిశోధన కేంద్రం ద్వారా తేనెటీగల పెంపకంపై వేలాది మందికి శిక్షణ అందజేస్తున్నారు. తేనెటీగల విశిష్టతను తెలియజేయటమే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా వాటివల్ల జరిగే ఉపయోగాలను తెలియజేస్తున్నారు. దీంతో అనేక మంది యువకులు తేనే టీగల పరిశ్రమలపై అత్యధికంగా దృష్టి సారిస్తున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో తేనెటీగల పై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఒక మంచి ఆదాయాన్ని రైతులు కోల్పోతున్నారు ప్రపంచ తేనెటీగల దినోత్సవ సందర్భంగా దీని వల్ల జరిగే ఉపయోగాలను గుంటూరు జిల్లా బాపట్ల లోని వైఎస్ఆర్ ఉద్యాన శాఖ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ధనుంజయ రావు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement