Tuesday, October 22, 2024

గౌడ సంఘీయుల అభ్యున్నతికి కృషి చేస్తా : కిషోర్ గౌడ్

తెనాలి : రాష్ట్రంలోని గౌడ సంఘాల ఐక్యత అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జై గౌడ్ ఉద్యమం రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ… జై గౌడ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ తనను రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 13 జిల్లాల్లో ఉన్న గౌడ సంఘాల సమస్యల పరిష్కారానికి జై గౌడ్ సంస్థ పనిచేస్తుందన్నారు. అన్ని జిల్లాలు, మండలాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సామాజిక వర్గంలో రాజకీయ అసమానతలను తొలగించి చైతన్యం వైపు పయనించేలా పని చేస్తానన్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న గౌడ నాయకులను కలిసి రంగస్థల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ముఖ్యంగా గౌడ కులంలో ఉన్న యువత ముందుకు వచ్చి కమిటీలో భాగస్వాములై.. కులాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు కృషి చేయాలన్నారు. త్వరలోనే రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయనున్నామని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గౌడ సంఘం గీత కార్మికులు, యువత, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సంఘీయులు అంతా ఏకతాటి పైకి వచ్చి పోరాడిన నాడే సమస్యలు పరిష్కారవుతాయని అన్నారు. జాతీయ అధ్యక్షులు తనపై పెట్టిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వహిస్తానని కిషోర్ గౌడ్ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement