Wednesday, May 15, 2024

ఉచిత వైద్య సేవలు అభినందనీయం- ఎమ్మెల్యే శివకుమార్

తెనాలి (ప్రభా న్యూస్) : ప్రజా సంక్షేమం, సేవా కార్యక్రమాలు అందించేందుకు తెనాలి పుట్టినిల్లు వంటిదని, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం తెనాలికే గర్వకారణమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ప్రముఖ నిష్ణాతులైన వైద్యులతో, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య సేవలు అందించి, ఉచితంగా మందులు పంపిణీ చేయడం, సంతోషించదగ్గ విషయమని, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భాస్కరుని శ్రీనివాసరావు, అచ్యుత సాంబశివరావు, కె.రామారావు , వెచ్చానాగరాజారావు మాలేపాటి తిరుమలేష్ రావు, జి. రామకోటేశ్వరరావు,తూనుగుంట్ల సుబ్బారావు,గట్టా నాగేశ్వరరావు, రాఘవ,పూర్ణ చంద్ర రావు,గుప్తా, సుబ్రమణ్యం, మోహన్, కిషోర్ లను అభినందిస్తున్నానని, అన్నారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు భాస్కరుని శ్రీనివాస రావు మాట్లాడుతూ అందరూ బాగుండాలి అందులో తాముండాలి అని, ప్రతి ఒక్క ఆర్య వైశ్యుడు అభిలషిస్తూ ఉంటారని, తాము పిలవగానే వచ్చిన కిమ్స్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ అనిల్, డాక్టర్ శివరాం, నేతృత్వంలోని వైద్యబృందం సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.రాబోవు రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీనివాస్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement