Monday, April 29, 2024

మంకీపాక్స్‌ను గుర్తించే ఆర్‌టీపీసీఆర్‌ కిట్ .. రియ‌ల్‌టైమ్‌లో క‌నిపెట్టేందుకు చాన్స్‌..

ప్రపంచమంతా గడగడ లాడించిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న వేళ మంకీపాక్స్‌ వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పటికే 20 దేశాలకు ఈ వైరస్‌ పాకగా.. 200లకు పైగా కేసులు వెలుగు చూశాయి. మరో 100 అనుమానిత కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్‌ గురించి ముమ్ముర పరిశోధనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో దేశానికి చెందిన మెడికల్‌ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్‌ హెల్త్‌ కేర్‌ మంకీ పాక్స్‌ను గుర్తించేందుకు ఓ రియల్‌టైమ్‌ పీసీఆర్‌ కిట్‌ను రూపొందించింది. ట్రివిట్రాన్‌ హెల్త్‌ కేర్‌కు చెందిన రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బృందం.. మంకీపాక్స్‌ వైరస్‌ను గుర్తించేందుకు ఓ ఆర్‌టిపిసిఆర్‌ కిట్‌ను తయారు చేసింది.

ఇది నాలుగు రంగుల ప్లోరోసెన్స్‌ ఆధారిత కిట్‌. ఇది నాలుగు రంగుల ప్లోరోసెన్స్‌ ఆధారిత కిట్‌. ఇది వన్‌ ట్యూబ్‌ సింగిల్‌ రియాక్షన్‌ ఫార్మాట్‌లో స్మాల్‌ పాక్స్‌. మంకీపాక్స్‌ తేడాను గుర్తిస్తుంది. ఈ కిట్‌ ద్వారా గంటలోనే ఫలితం తెలుసుకోవచ్చు అని ట్రివిట్రాన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ కిట్‌తో టెస్ట్‌ చేసుకునేందుకు పొడి స్వాబ్‌లతో పాటూ వీటీఎం (వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియా) స్వాబ్‌లను కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ సంద ర్బంగా సంస్థ సీఈఓ చంద్ర గంజూ మాట్లాడుతూ ” ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వైరస్‌ వ్యాప్తి కట్టడికి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి సాయం చేసేందుకు భారత్‌ ఎల్లప్పుడూ ముందుంటుంది” అని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement